దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు ఈరోజే మొదలైన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలన్న డిమాండ్ వచ్చినప్పటికీ, నేషనల్ టేస్టింగ్ ఏజెన్సీ అందుకు విముఖత చూపించింది. ఐతే నీట్ ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో తమిళనాడుకు చెందిన 19ఏళ్ల పిల్లవాడు మృతి చెందాడు. పరీక్షకు హాజరు కావాల్సిన పిల్లవాడు, ఇంట్లో శవమై కనిపించాడు. తమిళనాడు సేలంలో జరిగిన ఈ సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఆ పిల్లవాడి పేరు ఎస్ ధనుష్ గా గుర్తించారు. ఇప్పటి వరకు రెండు సార్లు నీట్ పరీక్ష రాసిన ధనుష్, నేడు మూడవసారి రాయాల్సి ఉండింది. కానీ ఫెయిల్ అవుతానేమోనన్న భయం అతన్ని ఆత్మహత్యకి గురి చేసింది. ఐతే ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి వ్రాతపూర్వక పత్రం లభించలేదు. కానీ పోలీసు అధికారులు చెప్పిన దాని ప్రకారం, ఆ పిల్లవాడి తల్లిదండ్రులు నీట్ ఎగ్జామ్ గురించి ఒత్తిడి తీసుకొచ్చ్చినట్లు సమాచారం. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ, నీట్ పరీక్ష నుండి తమిళనాడును మినహాయించాలని, ఈ మేరకు శాసన సభలో బిల్లు ఆమోదం జరిగేలా చూస్తామని స్టాలిన్ తెలిపారు.