బ్రౌన్ రైస్ ( Brown Rice ) ని మామూలుగా తినడం కంటే కూడా ఇలా కొన్ని రకాల రెసిపీస్ తయారు చేసుకుంటే బాగుంటుంది. అయితే ఈ రోజు మనం బ్రౌన్ రైస్ లెమన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావలసిన పదార్ధాలు ఏమిటి అనేది చూద్దాం.
బ్రౌన్ రైస్ లెమన్ రైస్ కి కావలసిన పదార్ధాలు:
బ్రౌన్ రైస్
కొద్దిగా నూనె
నిమ్మకాయలు
మినప్పప్పు
శనగ పప్పు
కరివేపాకు ఆకులు
పచ్చిమిర్చి
తయారు చేసుకునే పద్ధతి:
ముందుగా ఒకటిన్నర కప్పుల బ్రౌన్ రైస్ తీసుకుని నీళ్లు పోసి ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో నూనె వేసి.. నూనె వేడెక్కిన తర్వాత అందులో పల్లీలు, మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు వేయాలి. ఇవి వేగాక తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత అందులో పసుపు ఉప్పు వేసి ఒకసారి కలుపుకుని దానిలో 3 స్పూన్స్ నీళ్ళు వెయ్యండి. ఇప్పుడు మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం తీసుకుని వీటిలో కలిపేసి ఉప్పు నిమ్మ రసం వేసుకుని పైన పల్లీల తో గార్నిష్ చేసుకోండి అంతే ఇలా ఎంతో సింపుల్ గా బ్రౌన్ రైస్ లెమెన్ రైస్ ని తయారు చేసుకోవచ్చు.