కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై గత నాలుగు రోజులుగా తీవ్ర వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి బంద్ కు కూడా రైతులు పిలుపునిచ్చారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలోనే, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనపై కలెక్టర్ జితేశ్ వి వివరణ ఇచ్చారు.
ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని.. ఎవరి భూములను తీసుకోవడంలేదని తేల్చి చెప్పారు కలెక్టర్ జితేశ్ వి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అందరి అభిప్రాయాలను సేకరిస్తాం, అభ్యంతరాలు చెప్పడానికి రైతులకు పూర్తి హక్కుఉందన్నారు కలెక్టర్. ప్రభుత్వ ఆస్తులను ఎవరూ ధ్వంసం చేయకూడదని… ఒక వేళ అలా చేస్తే, పోలీసులు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.