పోలీసు బాస్‌కు బెదిరింపులు..! నిందితుడిపై కేసు

Hyderabad Commissioner Anjani Kumar: సాధారణంగా బడా బాబుల‌కు, రాజ‌కీయ నాయ‌కులకు బెదిరింపు కాల్స్ రావ‌డం మ‌నం త‌రుచుగా వింటుంటాం.. కానీ తాజాగా పోలీసు బాస్‌, హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌కే బెదిరింపులు వ‌చ్చాయి. ఓ పోరంబోకు అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఫైర్ అయిన హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు .. స‌ద‌రు నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళ్తే.. గ‌త రెండు రోజుల క్రితం సీపీ కంట్రోల్‌ రూం సిబ్బందికి ఓ వాట్సాప్ నెంబ‌ర్ ద్వారా రెండు మొబైల్‌ నంబర్లను వ‌చ్చాయి. అస‌లు స‌మ‌స్య ఎంటో తెలుసుకోవ‌డానికి .. అప్పుడూ కంట్రోల్‌ రూం విధుల్లో డ్యూటీలో ఉన్న‌ మురళీ అనే కానిస్టేబుల్‌.. అందులో ఉన్న ఓ నంబర్‌కు ఫోన్‌ చేశారు. ఆ వ్య‌క్తి స‌మ‌స్య ఎంటో తెలుసుకోనే ప్ర‌య‌త్నం చేశాడు.

కానీ ఆ వ్యక్తి తన సమస్యను చెప్పేందుకు నిరాక‌రించాడు. ఆ నెంబ‌ర్ ఎందుకు ఫోన్ చేశారంటూ ఎదురు ప్ర‌శ్నించాడు. అంత‌టితో ఆగ‌కుండా సీపీ అంజనీకుమార్‌పై తిట్ల వ‌ర్షం కురిపించాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. ఫోన్‌ కట్‌ చేశాడు. అనంత‌రం.. కానిస్టేబుల్ మ‌రోమారు నెంబ‌ర్‌కు ఫోన్ చేయగా .. అదే పరిస్థితి. సీపీని బెదిరిస్తూ దూషణలు ప్రారంభించాడు. దీంతో కానిస్టేబుల్‌ మురళీ సైబర్‌క్రైమ్‌ పోలీ‌స్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.