తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. 50 వేల నుంచి లక్ష లోపు రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని… తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. 50 వేల లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాల్ వచ్చిందని… లక్ష లోపు రుణమాఫీ కోసం వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయింపు చేసేలా… సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ సంపూర్ణంగా నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సొంత స్థలం ఉన్న నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఇందు కోసం బడ్జెట్లో 10 వేల కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రజలకు అన్నీ రకాల అండగా ఉండేది.. టిఆర్ఎస్ అని తెలిపారు మంత్రి హరీష్ రావు.