అఖిలపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్‌పై పొగడ్తల వర్షం

-

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన భేటీ అయిన అఖిల పక్షం సమావేశం ఇంకా కొనసాగుతోంది. అయితే.. ఈ భేటీలో సీఎం కేసీఆర్‌పై హాజరైన సీపీఎం, సీపీఐ పార్టీలు.. కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నాయి. దళిత సాధికారత కోసం సీఎం స్వయంగా ముందుకు రావడం… అటువంటి ఆలోచన చేయడం సంతోషంగా వుంది అఖిల పక్ష సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను కొనియడారు. సీఎం కెసిఆర్, 2003 లోనే దళిత సాధికారత కోసం సమావేశం ఏర్పాటు చేసి.. అనేక అంశాలను చర్చించడం తనకు గుర్తుందన్నారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న కళ్యాణ లక్ష్మి వంటి పలు అభివృధ్ధి సంక్షేమ పథకాలు దళితులకు భరోసానిస్తున్నాయి చాడ పేర్కొన్నారు.

కులాంతర వివాహాలను ప్రోత్సహించడంతో పాటు, దళితుల మీద దాడులు జరిగితే ఊరుకోబోమనే రీతిలో, కార్యాచరణ చేపట్టి, ప్రభుత్వం దళితులకు మరింతగా ధైర్యాన్ని నింపాలని డిమాండ్‌ చేశారు. అంతకు ముందు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. దళిత సాధికారత కోసం, సీఎం కెసిఆర్ తీసుకున్న చొరవ, దృఢ నిశ్చయం.. తమకు సంతోషాన్ని కలిగిస్తున్నదని పేర్కొన్నారు. మరియమ్మ లాకప్ డెత్ కేసులో, వారి కుటుంబానికి సహాయం చేస్తూ.. సీఎం కెసిఆర్ తక్షణ స్పందనదళిత సమాజంలో ఆత్మస్థైర్యాన్ని పెంచిందని వెల్లడించారు తమ్మినేని.

Read more RELATED
Recommended to you

Latest news