అనిశా యాప్.. లంచం అడిగితే ఫిర్యాదు చేయండి: జగన్

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిరోధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందులో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు.. అవినీతి నిరోధక శాఖ (అనిశా) కొత్తగా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బుధవారం యాప్‌ను ప్రారంభించారు. ‘ఏసీబీ 14400’ పేరుతో అవినీతి నిరోధక శాఖ యాప్‌ను రూపొందించింది.

ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం జగన్

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల్లో ఎక్కడైనా.. లంచం అడిగినట్లు కనిపిస్తే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. వీడియో, ఆడియో, ఫోటో ఆధారాలను పంపినప్పుడే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మీరు మీ ఫిర్యాదును రిజిస్టర్ చేయగానే మొబైల్‌కు రిఫరెన్స్ నంబర్ వస్తుందన్నారు. ఈ యాప్ అవినీతిని నిరోధించడానికి బ్రహ్మస్త్రం అన్నారు. మీరు పంపే ఫిర్యాదులను ఏసీబీ నేరుగా సీఎంఓకు నివేదిస్తుందన్నారు. అవినీతిపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా.. అధికారులు వెంటనే స్పందించాలని ఆదేశించారు. అన్ని స్థాయిల్లో అవినీతిని నిర్మూలించడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. అవినీతికి పాల్పడిన ప్రతిఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news