Big News : ముగిసిన ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ

-

ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు నేడు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ప్రశ్నించారు. హైదరాబాదులోని కవిత నివాసంలో కొద్దిసేపటి కిందట విచారణ ముగిసింది. ఈ ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను ప్రశ్నించిన సీబీఐ బృందం ఆమె నుంచి వివరాలు సేకరించింది. లిక్కర్ స్కాంలో సాక్షిగా కవిత వాంగ్మూలం నమోదు చేసింది. నేటి విచారణలో ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం పాల్గొంది. లిక్కర్ స్కాం నిందితుడు అమిత్ అరోరా వాంగ్మూలం ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

Kalvakuntla Kavitha accused of Delhi Liquor policy scam - ybrantnews.com

కాగా, 170 సెల్ ఫోన్లు ధ్వంసం చేశారన్న ఆరోపణలపైనా సీబీఐ అధికారలు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కవిత గతంలో వాడిన సెల్ ఫోన్ల వివరాలపై సీబీఐ అధికారులు ఆరా తీశారు. అవసరమైతే మళ్లీ కవితను ప్రశ్నిస్తామని సీబీఐ అధికారులు వెల్లడించారు. అయితే.. ఏడున్నర గంటల విచారణకు సంబంధించి కవిత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అంతేకాకుండా.. అనంతరం ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ కలువనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news