రేవంత్ ఇటు..సీనియర్లు అటు..హస్తంలో కన్ఫ్యూజన్?          

-

ఏంటో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికి క్లారిటీ ఉండదు..కాంగ్రెస్ నేతలు ఎప్పుడు ఎలా రాజకీయం చేస్తారో ఎవరికి అర్ధం కావడం లేదు..అసలు వారు ప్రత్యర్ధులపై ఫైట్ చేస్తున్నారో లేక సొంత పార్టీ నేతలపైనే ఫైట్ చేస్తారో తెలియదు…పార్టీలో అసంతృప్తులు, అలకలు చాలా ఉన్నాయి..అసలు ఎవరికి వారు వ్యక్తిగతంగా రాజకీయ లబ్ది పొందడానికి చూస్తున్నారు తప్ప..పార్టీని పైకి లేపాలని మాత్రం చూడటం లేదు.

congress
congress

పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏదో రకంగా పార్టీ కోసం కష్టపడుతున్నారు…కానీ ఆయనని వెనక్కి లాగేందుకు కొందరు నేతలు చూస్తున్నారు…అంటే ఆయన ఒక్కరే పార్టీని నడిపిస్తే..ఆయన ఒక్కరికే పేరు వచ్చేస్తుందనే కోణం సీనియర్ నాయకులకు ఉంది.

- Advertisement -

అటు రేవంత్ రెడ్డి సైతం సీనియర్లని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు..మన పని మనదే అన్నట్లు రేవంత్ ముందుకెళుతున్నారు…అంటే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డిది ఒక దారి అయితే..సీనియర్ నేతలది మరో దారి…ఇలా ఎవరికి యమునా తీరే అన్నట్లు ఉన్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ముందుకెళ్లిపోతున్నారు..ప్రజల్లోకి వెళ్ళి టీఆర్ఎస్ పై పోరాటం చేస్తున్నారు..భారీ సభలు పెడుతూ ముందుకెళుతున్నారు.

ఇటు సీనియర్లు ఏమో రేవంత్ కు పెద్దగా సహకారం అందించడం లేదు..వారు సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు.. తాజాగా సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో గీతారెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, కోదండ రెడ్డి, నిరంజన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ వైఖరిపైనే చర్చ నడిచినట్లు తెలిసింది. రేవంత్ అందరినీ కలుపుకుపోవడం లేదంటూ వీహెచ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి తదితరులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.. దీనిపై మరోసారి సమావేశమై చర్చించి సోనియాను అపాయింట్‌మెంట్ కోరాలని వారు నిర్ణయించుకున్నారు.

అంటే మళ్ళీ రేవంత్ గురించి ఢిల్లీలో పంచాయితీ పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు చూస్తున్నారు. ఎంతసేపు సొంత పంచాయితీలని చూసుకుంటున్నారు తప్ప…పార్టీని బలోపేతం చేయాలని అనుకోవడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...