అపెక్స్‌ కౌన్సెల్‌ భేటీ జరిగేనా.. క్లారిటీ ఇవ్వని తెలంగాణ సీఎం ?

-

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై చర్చించేందుకు అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సమావేశం రెండు మూడు సార్లు వాయిదా పడగా ఈ సారైనా జరుగుతుందా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే మీటింగ్‌కు హాజరయ్యే విషయంపై తెలంగాణ ప్రభుత్వం చప్పుడు చేయడం లేదు. మరో పక్క ఏపీ మాత్రం సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాల మీద నోట్ రెడీ చేసుకుంటోంది.

నిజానికి తెలుగు రాష్ట్రాల మధ్య అనేక జల వివాదాలు ఏర్పడ్డాయి. వీటిపై ఇరు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో వీటిని పరిష్కరించేందుకు అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. ఇందుకు అక్టోబర్‌ 6వ తేదీన ముహూర్తంగా నిర్ణయించింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌ ఈ సమావేశంలో పాల్గొంటారని భావిస్తున్నారు. ఆగస్టులోనే జరగాల్సి ఉన్న ఈ సమావేశం అనేక అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news