ఇందిరమ్మ రాజ్యంలో అంతా అరాచకలే.. పేదోళ్లు పేదోళ్లగానే ఉండిపోయారు.. మళ్లా ఆ దరిద్రం పాలన మనకెందుకు..? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. వైరా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మదన్‌లాల్‌కు మద్దతుగా ప్రసంగించారు. కాంగ్రెస్‌కు అధికారం వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తమని చెబుతున్నారు. ఎందుకు ఆ దిక్కుమాలిన పరిసాలన. ఏం ఉద్ధరించారు అని, ఆనాడు ఎవ్వళ్లు బాగుపడ్డారని, అంతా అరాచకాలు, పేదోళ్లు పేదోళ్లగానే ఉండిపోయారు. ఎస్టీలు, ఎస్సీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు.
ఏం చేయలేదు. చేస్తే దళిత, గిరిజనుల పరిస్థితి ఇట్ల ఉండేది కాదు. స్వాతంత్ర్యం వచ్చిన నాడే వారు ఆలోచించి ఉంటే ఈపాటికి దళిత, గిరిజన వర్గాలు బాగుపడాలి. కానీ జరగలేదు. ఇందిరమ్మ పాలనలోనే ఎమర్జెన్సీ వచ్చింది. ప్రతిపక్షాలను పట్టుకుపోయి జైల్లో వేసి చాలా దుర్మార్గమైన చీకటి రోజులు తెచ్చారు. మళ్లా ఆ దరిద్రం పాలన మనకెందుకు అవసరమే లేదు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత సమీక్షలు జరిపి ఒక దారి పట్టాం. పేదల సంక్షేమం చేశాం అని కేసీఆర్ తెలిపారు.