కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం : ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

-

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై తాజాగా ఆయన స్పందించారు. కాలేశ్వరం పేరుతో రాష్ట్ర వనరులను దోచుకున్న పాతోడు పోయిందని కొత్తోడు వచ్చిందని అంతే తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. బిఆర్ఎస్ దివాలా తీయించిన రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచిన అమలు చేయలేక పోయింది అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలులో తమ పార్టీ ప్రజాపక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు రాజకీయ విమర్శలతో కొట్టినట్టు, తిట్టినట్టు డ్రామాలు వేస్తున్నాయన్నారు.

కాంగ్రెస్ ఏడాది సంపురాలు ఎలాగో అలా ఏడాది గడిచిపోయిందని.. ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని చురకలు వేశారు. వాస్తవానికి రైతులు అంతో ఎంతో సంతోషంగా ఉన్నారంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సహాయం, 23,000 కోట్ల ఖర్చుతో అందిస్తున్న మద్దతు ధర, 90 శాతం సబ్సిడీతో యూరియా, ఉపాధి హామీ పథకం వంటి వాటితో ఏడాదికి ఒక్కో రైతు కుటుంబానికి 60 నుంచి 70 వేల కోట్లు కేంద్రం అందిస్తుందన్నారు. వాస్తవానికి దేశంలో, రాష్ట్రంలో వరి సాగు అవసరాన్ని మించి జరుగుతోందన్నారు. కేంద్ర మద్దతులకు ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news