కాంగ్రెస్‌ మునిగిపోతున్న నౌక… ఏ శక్తి కాపాడలేదు : రాజ్ నాథ్ సింగ్

-

కాంగ్రెస్‌ను ‘మునిగిపోతున్న నౌక’తో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పోల్చారు. నౌకకు అడుగున చిల్లు పడిందని, అది మునిగిపోకుండా ప్రపంచంలోని ఏ శక్తీ కాపాడలేదని అన్నారు.మధ్యప్రదేశ్‌ లోని ఖాండ్వా, బద్వానీ జిల్లాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గాంధీ కుటుంబంపై విమర్శలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం ఏర్పడినందున కాంగ్రెస్‌ను రద్దు చేయాలని మహాత్మాగాంధీ చెప్పారని, అయితే ఆయన అభ్యర్థనను కాంగ్రెస్ పెడచెవిన పెట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ ఏదైతే చెప్పారో దానిని పరిపూర్ణం చేసేందుకు దేశ ప్రజలు ఇప్పుడు స్థిరనిశ్చయంతో ఉన్నారని, కచ్చితంగా దేశంలో కాంగ్రెస్ అనేది లేకుండా చేస్తారని జోస్యం చెప్పారు.

జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ వంటి నేతలంతా పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పిన వాళ్లేనని, అయితే ఆ పని చేయడంలో వాళ్లు విఫలమయ్యారని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. మోదీ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో సమర్ధవంతంగా 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news