అవన్నీ కాంగ్రెస్ నిర్మించిందని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది : సామ రామ్మోహన్ రెడ్డి

-

అవన్నీ కాంగ్రెస్ నిర్మించిందని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని కాంగ్రెస్ సోషల్ మీడియా కమిటీ చైర్మన్   సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. తాజాగా ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. గత పదేళ్లలో దేశంలో ఎలాంటి మార్పులు జరుగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు మేలు జరిగిందన్నారు. ముఖ్యంగా పేదలందరికీ రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు.

బీజేపీ ఇప్పటివరకు ఒక్క రేషన్ కార్డును కూడా పెంచలేదన్నారు. వృద్ధులకు, వితంతువులకు బీజేపీ ఒక్క పైసా కూడా పెన్షన్ పెంచలేదన్నారు. ధరలను నియంత్రిస్తామని..అవినీతిని అంతం చేస్తామని, నల్లధనాన్ని ప్రజలకు పంచుతామని అధికారంలోకి వచ్చి బీజేపీ వారే దోచుకుంటున్నారని పేర్కొన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పదేళ్లలో ఎన్నికోట్ల ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు బీజేపీకి ఇంకా మేనిఫెస్టో నే లేదని.. కానీ కాంగ్రెస్ మేనిఫెస్టో పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సామ రామ్మోహన్ రెడ్డి. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని ఓట్లు వేయాలని ప్రశ్నించారు. 

Read more RELATED
Recommended to you

Latest news