కాంగ్రెస్ అంటేనే రైతుల పక్షపాతి అని మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆగస్టు 15న రుణమాఫీ పక్కా అంటూ ఆయనధీమా వ్యక్తం చేశారు.ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్లు ఐఐటీ, మెడికల్ కాలేజీలను తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని మోడీపై ఫైర్ అయ్యారు.బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్మార్ట్ సిటీలుగా వరంగల్, కరీంనగర్” అంటూ ఇచ్చిన హామీలకు పంగనామం పెట్టారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్‌లు కలిసి పనిచేశాయని, ఫలితాలు తర్వాత బీఆర్ఎస్ ఇక కనిపించదని అన్నారు.
విభజన హామీలేమయ్యాయి? అని ఆయన మండిపడ్డారు. కరువు జిల్లాలకు నష్ట పరిహారంపై మోడీ ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లేఖ రాసినా మౌనం వహించారన్నారు.నిత్యావసర వస్తువులు ధరలు పెంచేశారని,నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.