సోనియా గాంధీ సన్నిహిత రాజకీయ సలహాదారులలో ఒకరైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ ఈ ఉదయం గుర్గావ్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 71. కోవిడ్ ఇన్‌ఫెక్షన్ తర్వాత దాని నుండి కోలుకున్నా ఆయన పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధ పడుతున్నారు. ఆరోగ్యం క్షీణించినప్పటి నుండి ఈ ప్రముఖ రాజకీయ నాయకుడు గుర్గావ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ అహ్మద్ పటేల్ ఒక ట్వీట్ చేశారు. అందులో తన తండ్రి తెల్లవారుజామున 3.30 గంటలకు మరణించారని పేర్కొన్నారు.
ఆయనకి ఒక నెల క్రితం COVID-19 వైరస్ సోకింది. అది తగ్గినా ఆయన అతని ఆరోగ్యం మల్టీ ఆర్గాన్ ఫైల్యూర్ కారణంగా మరింత దిగజారింది. కాంగ్రెస్ కోశాధికారి అయిన అహ్మద్ పటేల్ కు అక్టోబర్ 1 న కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆ తరువాత అది తగ్గినా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో నవంబర్ 15 న గుర్గావ్‌లోని మెదంత ఆసుపత్రి ఐసియులో చేరారు. పటేల్ ఎనిమిదిసార్లు పార్లమెంటు సభ్యుడిగా అలానే తాత్కాలిక పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ మరణించిన రెండు రోజుల తర్వాత పటేల్ కూడా అదే రీతిలో మరణించడంతో కాంగ్రెస్ విషాదంలో మునిగిపోయింది.