కంగనా సిస్టర్స్ కు అనుకూలంగా తీర్పిచ్చిన బాంబే హైకోర్టు..!

-

యాంగ్రీ బార్డ్ కంగానా రనౌత్ రాజీవీ తర్వాత ఆ రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్న నటి. తాను పట్టిన కుందేళుకు మూడే కాళ్లు అన్నట్లు ప్రతిదానికి ఫైర్ అయిపోతుంది. అందరిని విమర్శిస్తుంది అని ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాల్లో ఏదో ఒక టాపిక్ తో కంగనా హల్ చల్ చేస్తోంది.అసలు కంగనా పోస్టులకు బలికాని వాళ్లు అంటూ ఎవ్వరూ ఉండరు. మొహమాటం లేకుండా ఉన్నది చెప్పేస్తోంది. తాజాగా ఈమె సామాజిక మద్యమాల్లో మరో గడిబిడా చేసేసిందండోయ్. ఎమన్నా అంటే నా ఓపినియన్ చెప్పా తప్పేంటి అంటుంది. అసలేం జరిగిందంటే.

kangana
kangana

ఇటీవల ముంబై పోలీసులు కంగనాతోపాటు ఆమె సోదరిపైన దేశద్రోహం కేసు నమోదు చేశారు.క్వాస్టింగ్ డైరెక్టర్ మాన్వల్ అలీ సయ్యద్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కంగానా సిస్టర్స్ పోస్టులు పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కంగనా సిస్టర్స్ ను విచారణకు రావాలని సమన్లు పంపారు. అయితే తనకు షూటింగ్స్ ఉన్నాయని కంగనా విచారణకు రాకుండా వాయిదా వేస్తుంది. దీంతో ఆగ్రహించిన పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు.

దీంతో ఈ సిస్టర్స్ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఎలాంటి మతవిద్వేషపూరిత పోస్టులు పెట్టలేదని కేవలం తమ ఉద్దేశాలను వెల్లడించామని ధర్మాసననాకి విచారణ ఇచ్చారు. పోలీసులు తమను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. వీరి వాదనవు విన్న ధర్మాసనం ఈ సిస్టర్స్ ను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. అంతేకాకుండా జనవిరి 8న ముంబై పోలీసులు మందు హాజరుకావల్సిందిగా న్యాయస్థానం పేర్కొంది. ఘూటింగ్స్ వెళ్లే సమయం ఉంది కానీ విచారణకు వచ్చే టైం లేదా అని ముంబై పోలీసులు వీరిద్దరిపై గుర్రు మన్నారు. కానీ ప్రస్తుతానికి హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సిస్టర్స్ విచారణకు గ్యాప్ వచ్చినా..భవిష్యత్తులో మాత్రం విచారణను ఎదుర్కోక తప్పదు. అయితే బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుకు కంగనా హర్షం వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news