మద్యం మనీతోనే మునుగోడు ఉపఎన్నిక జరిగింది : జైరామ్ రమేశ్

-

మద్యం, మనీతోనే మునుగోడు ఉపఎన్నిక జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రామేశ్ అన్నారు. ఇవి ఓట్ల ఎన్నికలు కాదని.. ఓట్ల ఎన్నికలని విమర్శించారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు వెలువడిన క్షణం ప్రజాస్వామ్యం హత్య గురైందని వాపోయారు. కోట్లు సంపాదించిన వారితో ఓ సామాన్య మహిళ పోరాడిందని తెలిపారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీలో సరికొత్త ఉత్సాహం నిండిందని జైరామ్ రమేశ్ అన్నారు. కొత్త ఉత్సాహం.. కొత్త శక్తితో కాంగ్రెస్ దూసుకు పోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో యాత్రకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించిందని వెల్లడించారు. తెలంగాణలో 8 జిల్లాల్లో 11 రోజుల పాటు 390 కిలో మీటర్లు రాహుల్ పాదయాత్ర సజావుగా కొనసాగిందని అన్నారు.

“తెలంగాణలో వన్‌సీఆర్‌, టూసీఆర్‌, త్రీసీఆర్‌, ఫోర్‌సీఆర్‌.. కేసీఆర్‌ అని గద్దర్‌ చెప్పిన మాట నిజమేనని అనిపిస్తోంది. కేసీఆర్‌అంటే అందరికీ అర్థమైంది కదా. 15 రోజుల పాటుపూర్తిగా అధికార యంత్రాంగాన్ని మోహరించారు. మద్యం ఏరులై పారి, 200 కోట్ల వరకు ఖర్చు చేశారు. అక్కడ ఓటమితో నిరాశ చెందడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ పోరాటం కొనసాగుతుంది. టీఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం కాంగ్రెస్‌ పార్టీనే.” అని జైరామ్ రమేశ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news