కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు అధిర్ రంజన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాపణలు చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును క్షమాపణలు కోరుతూ అధిర్ రంజన్ లేఖ రాశారు. అయితే… నిన్నటి వరకు కేంద్రానికి వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేస్తే.. ఇవాళ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బీజేపీ సభ్యులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్యలు తీవ్రం దుమారం రేపాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను.. ‘రాష్ట్రపత్ని’ అని సంబోధించడాన్ని అధికార పార్టీ ఎంపీలు తీవ్రంగా తప్పుబట్టారు.
రాష్ట్రపతి పదవిని అగౌరవపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ సభ్యులు నిరసనకు దిగారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధిర్ రంజన్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ తాతాల్కిక అధ్యక్షురాలు సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ.. స్మృతి ఇరానీ పార్లమెంట్‌లో డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.