రేవంత్ కి కాంగ్రెస్ అధిష్టానం షాక్, కంప్లైంట్ చేసింది ఎవరు…?

-

బలమైన అధికార పక్షం ఉన్నా సరే కాంగ్రెస్ మాత్రం తెలంగాణాలో అనుసరిస్తున్న వైఖరి ఆందోళన కలిగిస్తుంది. ఆ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా కష్టపడి పని చేస్తున్నా సరే నాయకుల తీరు మాత్రం ఆందోళన కలిగిస్తుంది. బలమైన నేతలుగా ఉన్న వారు అందరూ కూడా ఇప్పుడు అధిష్టానాన్ని అంతిమంగా పార్టీని తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయంగా పార్టీ ఇప్పుడు బలపడాల్సిన అవసరం ఉంది.

అయినా సరే ఈ విషయం తెలుసుకోని కొందరు నేతలు మాత్రం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. రేవంత్ పీసీసీ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారని అధిష్టానం కి లేఖ రాస్తా అని వచ్చే ఎన్నికల్లో ఉత్తమ కుమార్ రెడ్డి నాయకత్వంలో వచ్చే ఎన్నికలకు తెలంగాణా కాంగ్రెస్ వెళ్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

తెలంగాణా లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉత్తమ కి మద్దతుగా ఉన్నారు. ఎంపీ గా ఉన్న రేవంత్ బలమైన నేత అయినా సరే ఆయనకు మద్దతు ఇవ్వడానికి సిద్దంగా లేరు. ఇక ఇప్పుడు రేవంత్ ని తప్పించాలని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయించాలని తెలంగాణా కాంగ్రెస్ నేతలు పథకం సిద్దం చేసారు. ఇటీవల రేవంత్ ఒక మంత్రిని కలిసారు అని, కోడంగల్ నియోజకవర్గంలో ఉన్న స్థానిక నాయకత్వం సహా,

కొందరు కీలక నేతలను కాంగ్రెస్ నుంచి బయటకు తీసుకొస్తా అని ఒప్పందం చేసుకున్నారని అదే విధంగా ఎమ్మెల్యేల మీద కాంగ్రెస్ లో రేవంత్ వర్గం తీవ్ర ఆరోపణలు చేస్తుంది అని దాని వలన పార్టీకి అంతిమంగా నష్టం జరుగుతుందని ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. ఇక జగ్గారెడ్డి రాహుల్ కి రాస్తా అన్న లేఖలో కూడా ఇదే విషయాన్ని చెప్పే సూచనలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే రేవంత్ అంటే గిట్టని వాళ్ళే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news