హుజురాబాద్‌ బై పోల్.. కొండా సురేఖ కు కాంగ్రెస్ పార్టీ డెడ్ లైన్ !

-

హుజూరాబాద్ ఉపఎన్నికల తేదీని ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 30 న ఎన్నికలు…నవంబర్ 2న ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటికే హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో టీఆర్ఎస్, బిజెపిలు తమ అభ్యర్థులను ఖరారు చేయగా కాంగ్రెస్ మాత్రం సందిగ్ధం లో పడింది. మొదట్లో పొన్నం ప్రభాకర్ ను అనుకున్నా తర్వాత కొండా సురేఖ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇప్పటివరకు కొండా సురేఖ పోటీ చేస్తున్నట్లు ప్రకటన అధికారికంగా వెలువడలేదు.

konda surekha is huzurabad congress candidate

ఈ నేపథ్యం లోనే ఇవాళ సాయంత్రం లోపూ కొండా సురేఖ హుజూరాబాద్ లో పోటీ చేసే దానిపై క్లారిటీ ఇవ్వాలని డెడ్ లైన్ విధించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. సాయంత్రం లోగా పోటీ చేసేది.. లేనిది తేల్చాలని ఆదేశాలు జారీ చేసింది కాంగ్రెస్ పార్టీ. కొండా సురేఖ కాదంటే మరో అభ్యర్ధి కోసం ప్రయత్నం చేయనుంది కాంగ్రెస్.

అయితే కొండా సురేఖ కాదంటే రెడ్డి సామాజిక వర్గం అభ్యర్దిని పెట్టాలని సీనియర్లు సూచనలు చేస్తున్నారు. ఇక అటు కాంగ్రెస్ పార్టీ ముందు కొండా సురేఖ కొన్ని డిమాండ్స్ పెట్టింది. వరంగల్ లో మూడు సీట్ల కు వచ్చే ఎన్నికల్లో పోటీ కి హామీ ఇవ్వాలని పట్టు పడుతున్నారు కొండా సురేఖ. అయితే హుజూరాబాద్, వరంగల్ ఈస్ట్ నియోజక వర్గాల పై క్లారిటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇవాళ సాయంత్రం లోగా కొండా సురేఖ పోటీ చేయడం పై క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news