తెలంగాణ ప్రభుత్వంపై షర్మిల ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా మరోసారి షర్మిల ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు పెట్టుబడి రాకపోతే పండిన పంట వరద పాలైతే.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే రైతు మరేం చేస్తాడు అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ రైతుబంధు ఇచ్చి ఫసల్ బీమా బంద్ పెట్టాడు అని వ్యాఖ్యానించారు. పంటలకు బీమా లేదని… రైతుకు ధీమా లేదని షర్మిల అన్నారు.
పంటలు వాన పాలు అవుతున్నాయని పేర్కొన్నారు. నేను పెద్ద రైతు అని చెప్పుకునే దొరగారి కి రైతులు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో తెలియదా అని వ్యాఖ్యానించారు. అందుకే కేసీఆర్ కమిటీ వేశాడని పేర్కొన్నారు. కోర్టులు మొట్టికాయలు వేసే తప్ప ఏ పని చేయాలో సోయి రాదు కానీ కనీసం ఇప్పటికైనా పంట బీమా నమోదు చేసి ఇ రైతులను ఆదుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.