రాహుల్ గాంధీ చేరిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ పాతాళానికి పడిపోయింది : అమిత్ షా

-

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పై నిప్పులు చెరిగారు. రాహుల్‌ కాంగ్రెస్ లో చేరిన తర్వాత పార్టీ రాజకీయ స్థాయి పాతాళానికి పడిపోయిందని అమిత్ షా ఎద్దేవా చేశారు.ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్‌ షా పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ప్రతీ విషయానికి సమావేశాలకు హాజరుకాకుండా పార్లమెంటును అగౌరవ పరుస్తుందని అన్నారు .కేంద్రం చేసిన చట్టాలపై వారు లేవనెత్తే ప్రతీ ప్రశ్నకు తాము సమాధానం చెప్తామని, అయినా కూడా సమావేశాల మధ్యలో లేచి వెళ్లిపోవడం, చర్చలు జరగకుండా ఆపడానికి ప్రయత్నించడం వంటి చర్యలకు పాల్పడతారని ఆయన విరుచుకుపడ్డారు. ఇవి రాజ్యాంగ వ్యతిరేక చర్యలు కావా అని అమిత్ షా ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ కాంగ్రెస్‌లోకి రావడంతో ఆ పార్టీ కార్యకలాపాల్లో మార్పు వచ్చిందని, అప్పటినుంచి పార్టీ ప్రమాణాలు పడిపోయాయన్నారు. గత 20 సంవత్సరాలుగా వారు పార్లమెంటును బహిష్కరించడానికి రకరకాల సాకులు చెప్తున్నారన్నారు అని మండిపడ్డారు. ”రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధానమంత్రి సమాధానం ఇస్తున్నప్పుడు గంటన్నర పాటు ఆయనకు అంతరాయం కలిగించడం నా రాజకీయ చరిత్రలో నేనెప్పుడూ చూడలేదు. ప్రధాని నరేంద్ర మోడీని అగౌరవపరచడం రాజ్యాంగ వ్యవస్థను అగౌరవపరచడంతో సమానం”అని షా అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news