పార్టీని వదిలి వెళ్లిన వారు చచ్చిన వారితో సమానం- పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

-

కొత్తగా పీసీసీ అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి పార్టీలో జవసత్వాలు నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. పాత కొత్త క్యాడర్ ను కలుపుకునిపోయేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు పార్టీ సభ్యత్వాలను పెంచుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే మేడ్చల్ కొంపల్లిలో పార్టీ కార్యకర్తల సభ్యత్వాలు, శిక్షణ తరగతుల సమావేశం జరగుతోంది.  ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ’ మన పార్టీని వదిలి వెళ్లిన వారు చచ్చిన వారితో సమానం‘ అని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం కార్యకర్తలు కష్టపడాలన్నారు. సభ్యత్వాల కోసం కష్టపడ్డ వారిని అభినందించారు రేవంత్ రెడ్డి.’ పార్టీ కోసం పని చేయని వారికి జనవరి 26 తర్వాత సెలవే‘ అంటూ హెచ్చరించారు.

మరోవైపు శిక్షణ సమావేశాలు వేదికగా మరోమారు కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. జంగారాఘవ రెడ్డి , పొన్నాల లక్ష్మయ్య వర్గాల మధ్య విబేధాలు కనిపించాయి. తమకు పాస్ లు ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వారికి పాసులు ఇస్తున్నారని ఆందోళన చేశారు. జనగామలో పొన్నాల లక్ష్మయ్య వర్గానికి మాత్రమే పాసులు ఇచ్చి తమకు పాసుల ఇవ్వలేదని జంగారాఘవ రెడ్డి వర్గీయులు ఆందోళన చేశారు. పార్టీలో పనిచేసిన వారిని పక్కన బెట్టి.. కొత్తగా వచ్చిన వారికి పదవులు, ప్రాధాన్యత ఇస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news