బిజెపికి భయపడడానికి సీఎం జగన్ మేక కాదు పులి : కొడాలి నాని

-

Kodali comments on bjp

బీజేపీ బెదిరింపులకు బయపడడానికి ఇక్కడ ఉన్న సీఎం జగన్ మేక కాదు.. పులి అంటూ కొడాలి నాని ఫైర్ అయ్యారు. బీజేపీ ఉడత ఊపులకు భయపడేవారు ఎవరూ లేరు..అంటూ కొడాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉండగానే సోనియాగాంధీ ని ఎదిరించి బయటకి వచ్చిన మగాడు జగన్..అని కొడాలి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ టీడీపీ లను ప్రజలు తగులబెడతారని కొడాలి అన్నారు. అంతే కాకుండా కొడాలి నాని సీఎం జగన్ ఒరిస్సా టూర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏనాడైనా పక్క రాష్ట్రాల సీఎంల వద్దకి వెళ్లాడా..? అంటూ కొడాలి ప్రశ్నించారు. పొత్తుల కోసం రాజకీయ అవసరాల కోసం మాత్రం దేశం మొత్తం తిరిగాడని అన్నారు. సీఎం అయినప్పటినుండి జగన్ పక్క రాష్ట్రాలతో ఉన్న సమస్యల పరిష్కరం కోసం వెళ్తున్నారు అంటూ వ్యాఖ్యానించాడు. మారుమూల ఉన్న చిన్న చిన్న 21 గ్రామాల కోసం కూడా జగన్ ఒరిస్సా రాష్ట్ర సీఎంతో చర్చలకు వెళ్లారు..రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సీఎం జగన్ ఎంత దూరం అయినా వెళ్తారు అంటూ కొడాలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news