ప్రజలు రెండు సార్లు బటన్లు నొక్కి వైసీపీని గెలిపించాలి అని వైఎస్ జగన్ కోరారు.58 నెలలుగా చేస్తున్న అభివృద్దిని కొనసాగించేలా ప్రజలు ఆశీర్వదించాలి.. ప్రజల ఆత్మ గౌరవాన్ని పెంచిన వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి అని విజ్ఞప్తి చేశారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంధముగా భావిస్తూ.. 99 శాతం హామీలు అమలు చేశాం అని సీఎం జగన్ తెలిపారు.
ఇదే కూటమి 2014లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని విమర్శించారు. ఈ కూటమి రంగు రంగుల మేనిఫెస్టో ఇంటింటికి పంచి.. హామీలు తుంగలో తొక్కింది అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి.. సింగపూర్ ను మించి అభివృద్ది చేస్తామని బాబు చెప్పారు.. కానీ జరిగిందా అని సీఎం జగన్ ప్రశ్నించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం చేసింది.. ఏకంగా 2 లక్షల 70 వేల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేశాం అని తెలిపారు.