దేశంలో మరోసారి రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో రైలు పట్టాలపై మరోసారి ఎల్పీజీ సిలిండర్ లభ్యమైంది. ఆ ట్రాకుపై వస్తున్న గూడ్స్ రైలు లోకోపైలట్ సిలిండర్‌ను గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.అనంతరం లోకోపైలట్ రైల్వే అధికారులకు సమాచారం అందించడంతో ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు ఉపాధ్యాయ్ వెంటనే స్పందించారు.
ధంధేరా నుంచి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న లాండౌరా స్టేషన్ వద్ద ఆదివారం ఉదయం 6:35 గంటలకు ఈ ఘటన జరిగిందన్నారు. పాయింట్‌మెన్‌ను పంపించి తనిఖీలు చేయించగా.. సిలిండర్ ఖాళీగా ఉందని తేలిందన్నారు. దానిని ధంధేరాను స్టేషన్ మాస్టర్ కస్టడీలో ఉంచామన్నారు.దీనిపై స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు అధికారి హిమాన్షు తెలిపారు. ఆగస్టు నెల నుంచి దాదాపు 18 సార్లు దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాలకు కుట్రలు జరిగాయని భారతీయ రైల్వే వెల్లడించింది.