విధుల్లో పాల్గొనడానికి 450 కిలోమీటర్లు నడిచిన కానిస్టేబుల్…!

-

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల లాక్ డౌన్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో సామాన్యులు ఇప్పుడు నరకం చూసే పరిస్థితి ఏర్పడింది దేశంలో. ఎవరికి చెప్పుకోలేక చాలా మంది పేదలు నరకం చూస్తున్నారు. వేలాది మంది పొట్ట కూటి కోసం ఊళ్లు వలస పోతున్నారు. సొంత ఊళ్లకు వెళ్ళడానికి వందల కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నారు. కరోనా వస్తుంది అనే భయం లేకుండా తిరుగుతున్నారు.

అయితే తాజాగా ఒక కానిస్టేబుల్ విధుల్లో పాల్గొనడానికి గానూ మధ్య ప్రదేశ్ లో దాదాపు 450 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసాడు. మధ్యప్రదేశ్‌కి చెందిన 22 ఏళ్ల కానిస్టేబుల్‌ దిగ్విజయ్ శర్మకి 450 కిలోమీటర్ల దూరంలో డ్యూటి పడటంతో వెళ్ళడానికి వాహనాలు అంటూ ఏమీ లేకపోవడంతో అతను నడిచి వెళ్ళాడు అంత దూరం. అక్కడికి వెళ్లి అనంతరం విధులు నిర్వహించడం ఇప్పుడు సంచలనంగా మారింది.

మార్చి 25న బుధవారం ఎటావా నుంచీ ఉదయాన్నే బయల్దేరిన దిగ్విజయ్ శర్మ… రోజంతా (20 గంటలు) నడిచాడు. రోజు అంతా నడిచి వెళ్లి అక్కడ విధుల్లో పాల్గొనడంతో ఉన్నతాధికారులు కూడా షాక్ అయ్యారు అతని నిబద్దత చూసి. కొంత మందిని లిఫ్ట్ అడిగాడు, కొంత దూరం నడిచాడు. ఇలా విధుల్లో పాల్గొన్నాడు. స్వచ్చంద సంస్థలు ఇచ్చిన ఆహరం తింటూ ప్రయాణం మొదలుపెట్టి వెళ్ళాడు.

Read more RELATED
Recommended to you

Latest news