ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న మొత్తం 10,011 వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం వైయస్.జగన్ ఆదేశాలు జారీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు, వైయస్సార్ హెల్త్ క్లినిక్స్, కంటివెలుగుతో పాటు ప్రాధాన్య కార్యక్రమాలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ.. 10,011 వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టా త్మకంగా తీసుకున్నామని పేర్కొన్నారు. వైయస్సార్ కంటి వెలుగులో భాగంగా ఇంతకుముందు ఎవరైనా పరీక్షలు చేయించుకోనివారికి పరీక్షలు చేయించాలన్నారు. కంటి సమస్యలు గుర్తించిన వారికి కళ్లజోడు ఇవ్వాలని, అవసరమైనవారికి శస్త్రచికిత్సలు చేయించాలని పేర్కొన్నారు సీఎం జగన్.
కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశా లు జారీ చేశారు. దీని కోసం ఒక వారంరోజులపాటు డ్రైవ్ నిర్వహించాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విలేజ్ హెల్త్ క్లినిక్స్‌కు, 104కు అనుసంధానంచేసి.. నిరంతర ప్రక్రియగా కొనసాగించాలన్నారు సీఎం జగన్.