హైదరాబాద్ 200 ఎకరాల్లో AI సిటీ నిర్మాణం : మంత్రి శ్రీధర్ బాబు

-

హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేంచుకు కాంగ్రెస్ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో భారీ పెట్టుబడులు వస్తాయని, కొన్ని ప్రపొజల్ స్టేజీలో ఉన్నాయన్నారు. తెలంగాణకు కృత్రిమ మేథ (AI)లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తమ ప్రభుత్వం 200 ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయబోతుందని వెల్లడించారు.

ఈనెల 5,6వ తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ గ్లోబల్ ఏఐ సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ సిటీ నిర్మాణం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బడాబడా కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా మారుతుందని గుర్తుచేశారు. అందుకే భవిష్యత్‌లో నగరాన్ని ఏఐకు కేంద్రబిందువుగా మారుస్తామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి నగరాలతో పోటీ పడుతుందని వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news