ఏపీ, తెలంగాణ వరద బాధితుల కోసం సోనుసూద్ భారీ సాయం.. చిన్న mail చేస్తే చాలు!

-

Sonu Sood Provides Email ID for Direct Help to Andhra Pradesh and Telangana: ఏపీ, తెలంగాణ వరద బాధితుల కోసం సోనుసూద్ భారీ సాయం చేయనున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఎడతెగని ప్రయత్నాలకు పేరుగాంచిన సోనూ సూద్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలలో వినాశకరమైన వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి మరోసారి ముందుకు వచ్చారు.

 

విపత్తుల సమయంలో అనేక మానవతా ప్రయత్నాలలో ముందంజలో ఉన్న నటుడు సోను సూద్, ఇప్పుడు తెలుగు ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఒక సందేశాన్ని పంచుకున్నారు సోనూసూద్. “ఆంధ్ర, తెలంగాణ వినాశకరమైన వరదలతో యుద్ధం చేస్తున్నప్పుడు, మేము అవసరమైన వారికి అండగా ఉంటాము” అని పేర్కొనారు. వరద బాధితులు సహాయం కోసం [email protected] అనే ఇమెయిల్ కు మెసేజ్ పెట్టాలని కోరారు. ఆలా చేస్తే తన సూద్ ఛారిటీ ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తామని చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news