హెరిటేజ్ ప్లాంట్లో కరోనా.. యథావిథిగా కార్యకలాపాలు!

-

కరోనా విషయంలో సామాన్యులే చాలా జాగ్రత్తగా ఉండి… ఏదైనా అనుమానం వస్తే క్వారంటైన్ కు వెళ్లడం, టెస్టులకు వెళ్లడం చేస్తున్నారు. మొదట్లో అలా లేకపోయినా… మెల్లమెల్లగా అర్ధం చేసుకుని ఆచరిస్తున్నారు. అయితే ఈ విషయంలో బడా బడా కంపెనీలు మాత్రంం ఈ విషయాలను గోప్యంగా ఉంచుతూ సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లోని హెరిటేజ్ సంస్థ ఇలానే గోప్యంగా ఉంచిందని వార్తలు వస్తున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే… హైదరాబాద్ లోని ఉప్పల్ హెరిటేజ్ ప్లాంట్లో కరోనా వైరస్ కలకలం చోటు చేసుకుంది. ఇక్కడ పనిచేస్తున్న ఒక సెక్యూరిటీ గార్డుకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు తెలుస్తోంది. ఆ సెక్యూరిటీ గార్డ్ తోపాటు అతని తల్లిదండ్రులకు కూడా కరోనా సోకిందట. అయితే సిబ్బందికి కరోనా సోకిన విషయాన్ని హెరిటేజ్ సంస్థ గోప్యంగా ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. సెక్యూరిటీ గార్డుకు కరోనా సోకడంతో మొత్తం ఇక్కడి మిగిలిన ఏడుగురు గార్డులను హోమ్ క్వారంటేన్లో ఉండాలని వైద్యులు సూచించారు. అలాగే… హోమ్ క్వారంటేన్లో ఉండాలని ఏడుగురికి స్టాంప్ కూడా వేశారు.

దీంతో… వారిని బయటకు రావొద్దని, రానివొద్దని వైద్యులు సూచించారు. కానీ… స్టాంపులు ఉన్న వారు కూడా బయట తిరుగుతుండటం, డ్యూటీ చేస్తున్నట్లు కనిపించడంతో… స్థానికులు ఈ హెరిటేజ్ ప్లాంట్ ముందు ఆందోళనకు దిగినట్లుగా సమాచారం. ఇదే క్రమంలో మరోవైపు ప్లాంట్ కార్యకలాపాలు కూడా యథావిథిగా కొనసాగుతున్నాయి! దీనిపై చర్యలు తీసుకోవాలని, పదిమందికి చెప్పాల్సిన పెద్దలే ఇలాంటి చిల్లర పనులు చేయడం మంచిది కాదని సూచిస్తున్నారట!

Read more RELATED
Recommended to you

Latest news