రాజ్ భవన్ లో కరోనా కలకలం..!

ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో కరోనా కలకలం రేపింది. రాజ్ భవన్ లో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది 15 మందికి కరోనా రావడంతో ఒక్కసారిగా ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో సుమారు 72 మంది భద్రతా సిబ్బందిని ఉన్నతాధికారులు మార్చినట్టు తెలుస్తోంది. కొత్త సిబ్బంది ఒకేసారి రావడంతో రాజ్‌భవన్ బయట హడావుడి నెలకొంది. కాగా, పీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,20,390కి చేరింది. కరోనాను జయించి 55,406 మంది కోలుకోగా.. 1213 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 63,771 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.