కరోనాని జయించిన విజయసాయి రెడ్డి.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌..! కాకపోతే..?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఇటీవల కరోనా వైరస్ బారినపడ్డ విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో విజయసాయి రెడ్డి అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా పాజిటివ్‌తో వారం క్రితం విజయసాయి అపోలోలో చేరారు. చికిత్స తర్వాత నెగటివ్‌ రావడంతో ఆయనను వైద్యులు డిశ్చార్జ్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడంతో ఆయన ఫామ్‌హౌజ్‌కు వెళ్లినట్లు సమాచారం.

కాగా, ఇటీవల వైఎస్ జయంతి కార్యక్రమంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళంలో జరిగిన సభకు చాలా మంది హాజరయ్యారు. దీంతోపాటు విజయసాయిరెడ్డి వెంట మందీ మార్బలం ఉంటారని.. సామాజిక దూరం నిబంధన పట్టించుకోరనే అపవాదు ఉంది. దాంతో కరోనా వైరస్ సోకి ఉండొచ్చు అనే అనుమానం వ్యక్తమవుతుంది.