శవాల గుట్టగా న్యూయార్క్…!

-

అగ్ర రాజ్యం అమెరికా ఆర్ధిక రాజధాని అయిన న్యూయార్క్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే… అక్కడ మరణాల సంఖ్య మాత్రం ఆగడం లేదు. కేసులు పెరుగుతున్నాయి. మరణాలు కూడా చాలా వేగంగా పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వేల మంది చనిపోతే అమెరికాలో వెయ్యి మంది కి పైగా చనిపోయారు. అందులో 600 మంది న్యూయార్క్ లో చనిపోయారు.

అక్కడ కేసులు రెండు లక్షల దిశగా పయనిస్తున్నాయి. అమెరికా మొత్తం ఏ స్థాయిలో పరిస్థితి ఉందీ అనేది పక్కన పెడితే న్యూయార్క్ మాత్రం అత్యంత భయంకరంగా ఉంది. భూతల స్వర్గంగా న్యూయార్క్ ని పేర్కుంటూ ఉంటారు. అలాటి న్యూయార్క్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే శవాలే కనపడుతున్నాయి. న్యూయార్క్ కి దగ్గరగా ఉండే న్యూజెర్సీ లో కేసులు దాదాపు 60 వేల వరకు ఉన్నాయి.

న్యూయార్క్ లో శవాలను దహనం చేయడానికి కూడా ఎవరూ ముందుకి వచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఇక అక్కడ వైద్యులు కూడా భయపడుతున్నారు. వైద్యం చేయడానికి ఎవరూ కూడా ముందుకి రావడం లేదు. ఇప్పుడు ట్రంప్ సర్కార్ కి న్యూయార్క్ లో కేసులను కట్టడి చేయడం పెద్ద సవాల్ గా మారింది. అక్కడ భారీగా వైద్య సిబ్బంది ఉన్నా సరే కేసులను కట్టడి చేయడం మాత్రం సాధ్యం కావడం లేదు. న్యూయార్క్ ని చూసి అమెరికా భయపడుతుంది. ప్రపంచమే భయపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news