ఇండియాలో తగ్గిన కోవిడ్ కేసులు… 24 గంటల్లో కొత్తగా 5326 కరోనా కేసులు నమోదు..

ఇండియాలో కోవిడ్ కేసులు తక్కువగా నమోదువుతున్నాయి. గడిచిన కొంత కాలంగా ఇండియాలో రోజూవారీ కేసుల సంఖ్య 10 వేల కన్నా దిగువనే ఉంటోంది. ఓ వైపు ఓమిక్రాన్ భయపెడుతున్నా.. కేసుల నమోదు తక్కువగానే ఉండటం ఉపశమనం కలిగిస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమాలపై కేంద్రం సీరియస్ గా చర్యలు తీసుకుంటోంది. దీంతో దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య తక్కువగా ఉంటోంది. యూరోపియన్ దేశాలతో పోలిస్తే ఇండియాలో నమోదవుతున్న కోవిడ్ కేసులు చాాలా తక్కువనే చెప్పవచ్చు.

తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 5326 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు 8043 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. ఇదిలా ఉంటే మరణాల సంఖ్య స్వల్పంగా పెరగినట్లు కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 453 మంది కోవిడ్ కారణంగా మరణించారు.

దేశంలో కరోనా కేసులు వివరాలు

యాక్టివ్ కేసులు- 79,097

కరోనా మరణాల- 4,78,007

మొత్తం కేసులు- 3,47,52,164

రికవరీ- 3,41,95,060

వ్యాక్సినేషన్ డోసులు- 1,38,34,78,181