వెయ్యికోట్ల బ్యాంక్‌ గ్యారెంటీలో రూ.600కోట్లు వాడేశారు…!

-

కరోనా సంక్షోభం టీఎస్‌ ఆర్టీసీని అతలాకుతలం చేస్తోంది. సుదీర్ఘ సమ్మె తర్వాత సంస్థ పరిస్థితి, తమ జీవితాలు గాడిన పడుతున్నాయని అనుకుంటున్న తరుణంలో కరోనా కొత్త కష్టాలు తెచ్చి పెట్టింది. ఉద్యోగులకు నెలవారీ జీతాల చెల్లింపు తలకుమించిన సమస్యగా మారింది. తెలంగాణలో 97 బస్‌ డిపోలు ఉన్నాయి. 10వేల 500 బస్‌లకు వెయ్యి బస్సులు పక్కన పెట్టారు. 49 వేల మంది ఉద్యోగులున్నారు. కరోనా ముందు ఆర్టీసీకి రోజువారీగా 14 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఐదారు కోట్లు రావడమే గగనమవుతోంది.

ఉద్యోగుల జీతాలకు నెలకు 230 కోట్లు కావాలి. సమ్మెకు ముందు ప్రతినెలా మొదటి వారంలో జీతాలు ఇచ్చేవారు. సమ్మె తర్వాత ఆర్టీసీని గాడిన పెట్టేందుకు వెయ్యి కోట్ల బ్యాంక్‌ గ్యారెంటీ ఇప్పించింది ప్రభుత్వం. అందులో ఇప్పటికే 600కోట్లను సంస్థ వాడుకుంది. కరోనా తర్వాత 12వ తేదీ వచ్చినా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగులకు 3 నెలలపాటు సగం జీతాలే చెల్లించారు. కారణాలేమైనా ఉద్యోగులు 4 డీఏలకు దూరమయ్యారు. వీటితోపాటు ఉద్యోగులు దాచుకున్న సొమ్ముకు 8 శాతం వడ్డీతో కలిపి తిరిగి ఇస్తామని సంస్థ చెప్పినా.. అవీ ఇవ్వలేదు. ఈ ఏడాది దసరా అడ్వాన్స్‌ లు కూడా కష్టమేనని నిట్టూరుస్తున్నారు ఆర్టీసీ కార్మికులు.

Read more RELATED
Recommended to you

Latest news