ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఎం జగన్ కు ఫోన్ చేశారు. రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు అనంతర పరిస్థితుల పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో వర్ష ప్రభావిత ప్రాంతాలు, నెలకొన్న పరిస్థితులను ప్రధానికి వివరించారు సీఎం జగన్. వాయుగుండం తీరందాటిందని, మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని మోడీకి వివరించిన జగన్ అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్ళారు. అధికారులు అప్రమత్తమై సహాయకచర్యల్ని చేపట్టడంతో ప్రాణనష్టం తప్పిందన్నారు.
బిగ్ బ్రేకింగ్: సీఎం జగన్ కి ప్రధాని మోడీ ఫోన్…!
-