కరోనా ఎఫెక్ట్.. దీపావళి అమ్మకాల్లో చైనాకు కోట్లల్లో నష్టం !

-

ఈ ఏడాది దీపావళి అమ్మకాలు దేశవ్యాప్తంగా రూ.72 వేల కోట్ల మేర జరిగినట్లు ది కాన్ఫెడెరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌(సీఏఐటీ) వెల్లడించింది. కరోనా వ్యాప్తి, తూర్పు లదాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా చైనా వస్తువులను బహిష్కరించాలి అని దిగ్గజ సంస్థలు పిలుపునివ్వటంతో ఆ ప్రభావం దీపావళి టపాసుల్లో జోరుగా కనిపించింది. ఈ క్రమంలో భారత సైనికులను పొట్టనబెట్టుకున్న డ్రాగన్‌ ఆర్మీ దురాగతాలను నిరసిస్తూ ‘బ్యాన్‌ చైనా ప్రొడక్ట్స్’ అంటూ ప్రచారం నిర్వహించిన ఈ ట్రేడ్‌బాడీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

diwali

దేశంలోని 20 ప్రధాన వాణిజ్య పట్టణాల నుంచి సేకరించిన నివేదిక ప్రకారం.. ‘‘దీపావళి పండుగ సందర్భంగా సుమారు రూ.72 వేల కోట్ల మేర టర్నోవర్‌ జరిగింది. తద్వారా చైనా మార్కెట్‌కు 40 వేల కోట్ల నష్టం వాటిల్లింది. భవిష్యత్‌లోనూ ఇలాంటి మంచి ఫలితాలే లభిస్తాయని ఆశిద్దాం.’’ అని నివేదికలో పేర్కొంది. ఇక పండుగ నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ వస్తువులు, వంట సామగ్రి, ఫర్నీచర్‌, వాల్‌హ్యాంగింగ్స్‌, బంగారం, ఆభరణాలు, ఫుట్‌వేర్‌, వాచ్‌లు, దుస్తులు, ఇంటి అలకంరణ సామగ్రి, ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌, గిఫ్ట్‌ ఐటెంలు, స్వీట్లు తదితర వస్తువులు ఎక్కువగా అమ్ముడుపోయినట్లు వెల్లడించింది.

ఈ ఏడాది జూన్‌లో గల్వాన్‌ లోయలో చైనా సైనికుల దురాగతానికి 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. వాస్తవాదీన రేఖ యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించిన డ్రాగన్‌ ఆర్మీని అడ్డుకునే క్రమంలో కల్నల్‌ సంతోష్‌ బాబు వీర మరణం పొందారు. ఈ నేపథ్యంలో చైనా వస్తువులను నిషేధించాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఇక సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో జాతీయ భద్రత, సమాచార గోప్యతకు భంగం కలిగే అవకాశాలున్న నేపథ్యంలో టిక్‌టాక్‌, పబ్జీ, వీచాట్‌ తదితర చైనీస్‌ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో డ్రాగన్‌ కంపెనీలు భారీ నష్టాన్ని చవిచూశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version