ఎన్.టి.ఆర్ అలా సక్సస్ అవుతాడా లేక దారుణంగా చేతులు కాల్చుకుంటాడా …?

-

నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ, ఎన్టీఆర్ .. కళ్యాణ్ రామ్ ఇప్పుడు స్టార్ హీరోలుగా మంచి ఫాం లో ఉన్నారు. బాలయ్య, ఎన్టీఆర్ హీరోలుగా భారీ చిత్రాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ కొమరం భీం గా రాం చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. 2021 సంక్రాంతికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకుడు రాజమౌళి పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరోసారి మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడు.

 

ఇక ఎన్.టి.ఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రాం అటు నిర్మాతగా ఇటు హీరోగా సక్సస్ అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ హీరోగా నటిస్తూనే, సినిమాలు నిర్మిస్తున్నాడు. అంతే కాదు తమ్ముడు ఎన్టీఆర్ తో కూడా సినిమాలని నిర్మిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత త్రివిక్రం, ఎన్టీఆర్ కాంబోని కూడా కళ్యాణ్ రాం తన బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రాం బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో జై లవకుశ వంటి బ్లాక్ బస్టర్ వంటి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెరకెక్కించబోయో ఈ సినిమాని మరో నిర్మాణ సంస్థ తో కలిసి కళ్యాణ్ రాం నిర్మిస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ కూడా కొత్త బ్యానర్ ని పెట్టబోతున్నాడని లేటెస్ట్ న్యూస్. టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు ఇతర వ్యాపారాలలో కొనసాగుతు సంపాదనలో ఉన్న సంగతి తెలిసిందే. అంతే కాదు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు సొంత వ్యాపారలతో పాటు సొంత బ్యానర్స్ లోను సినిమాలను నిర్మిస్తూ సక్సస్ లను అందుకుంటున్నారు. వీళ్ళ జాబితాలో ఎన్టీఆర్ కూడా చేరబోతున్నాడు. ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ పేరు మీద కొత్త బ్యానర్ ని స్థాపించి వరుసగా సినిమాలను నిర్మించబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ 31 వ సినిమా సొంత బ్యానర్ లో ఉండబోతుందట. కళ్యాణ్ రాం బ్యానర్ లో ఎన్టీఆర్ నటించగా ఇప్పుడు ఎన్టీఆర్ సొంత బ్యానర్ లో కళ్యాణ్ రాం నటించబోతుండటం ఆసక్తికరమైన విషయం. అంతేకాదు ఈ బ్యానర్ లో ఎన్టీఆర్, కళ్యాణ్ రాం కలిసి మల్టీ స్టార్ ని చేయబోతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news