ఆంధ్రప్రదేశ్: కూలింగ్ బీర్లు కోరుతూ చీటీ రాసి ఓటేసిన వ్యక్తి..

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు ఇటీవలే జరిగాయి. ఎంపీటీసీ, జడ్పిటీసీ స్థానాల్లో వైసీపీ హవా కొనసాగించింది. టీడీపీకి చాలా చోట్ల సీట్లు కూడా దక్కలేదు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఐతే ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఓ వింత చీటీ కనిపించింది. సాధారణంగా ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాని గురించి తమ గ్రామ సర్పంచికో, లేదా సంబంధిత ప్రభుత్వ అధికారికో ఫిర్యాదు చేస్తారు. కానీ, అనంతపురం జిల్లాలోని నల్లచెరువు గ్రామ యువకుడు మాత్రం తన సమస్యను ఓట్లు వేసేటపుడు చీటీ రాసి వినిపించాడు.

అవును.. ఓటుతో పాటు తన సమస్యను చిన్న చీటీపై రాసాడు. నల్లచెరువు గ్రామంలోని వైన్ షాపులో కూలింగ్ బీర్లు పెట్టాలని, కూలింగ్ బీర్లు దొరకట్లేదని, ఈ మేరకు అధికార్లు చర్యలు తీసుకోవాలని చీటీలో రాసి, ఇట్లు నల్లచెరువు యువత అని వెల్లడి చేసి మందుబాబుల కన్వీనర్ గా తనను తాను చెప్పుకున్నాడు. ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తికి తన సమస్య గురించి చెప్పుకోవాల్సి వస్తే కూలింగ్ బీర్ల కంటే పెద్ద సమస్య చెప్పుకోవచ్చుగా అని చాలామంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news