హైదరాబాద్: కరోనా కేసులపై తెలంగాణ వైద్యారోగ్య శాఖ తాజా బులెటెన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,892 కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొంది. మొత్తం 46 మంది మృతి చెందినట్లు తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తం 4 లక్షల 81 వేలకు కరోనా కేసులు చేరుకున్నట్లు ప్రకటించింది. 2 వేల 625 మంది మృతి చెందారని వెల్లడించింది.
ఇంకా తెలంగాణలో ప్రస్తుతం 73 వేల 851 యాక్టివ్ కేసులున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా 1104 కరోనా కేసులు నమోదు కాగా తరంగారెడ్డి 443, మేడ్చల్ 378, నల్గొండ జిల్లాలో 323 కేసులు, వరంగల్ అర్బన్ 321, కరీంనగర్ జిల్లాలో 263 కరోనా కేసులు, నాగర్‌కర్నూలు 204, సిద్దిపేట 201, మహబూబ్‌నగర్ జిల్లాలో 195 కేసులు నమోదయ్యాయి.
ఇక తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రోజుకు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటోంది. కరోనా జాగ్రత్తలపై సూచలను చేస్తూనే ఉంది. అయినా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మరణాల శాతం అధికశాతమైంది. ఆక్సిజన్ కొరత తీవ్రతరం అయింది. ఇతర రాష్ట్రాలు ఆక్సిజన్ అందిస్తున్నాయి. రాష్ట్రంలో రాత్రి పూట కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాలకు పలు బస్సులను రద్దు చేస్తూ టీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.