ఇండియా కరోనా అప్డేట్..మ‌ళ్లీ 30వేలు దాటిన కేసులు..!

దేశంలో క‌రోనా కేసులు పూర్తిగా త‌గ్గుముకం ప‌ట్ట‌లేదు. ఇప్ప‌టికీ కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లో దేశంలో కొత్తగా 34,403 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దాంతో ఇప్ప‌టి వ‌ర‌కూ దేశంలో క‌రోనా కేసుల సంఖ్య‌3,33,81,728 కు చేరింది. ఇక గ‌డిచిన 24గంట‌ల్లో 320 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. దాంతో మ‌ర‌ణాల సంఖ్య 4,44,248 కి చేరుకుంది. మ‌రో 37,950 మంది క‌రోనా నుండి కోలుకోగా మొత్తం క‌రోనాను జ‌యించిన వారి సంఖ్య‌ 3,25,98,424 కు చేరుకుంది.

ఇదిలా ఉండ‌గా దేశంలో క‌రోనాను అరిక‌ట్టేందుకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా జ‌రుగుతోంది. స్పెష‌ల్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ల‌ను నిర్వ‌హించి వ్యాక్సిన్ లు వేస్తున్నారు. ప‌ట్ట‌ణాలు ప‌ల్లెల్లో స్పెష‌ల్ వ్యాక్సినేష‌న్ కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ల‌ను ఇస్తున్నారు. మొద‌ట్లో వ్యాక్సిన్ లు వేసుకునేందుకు ప్ర‌జ‌లు మందుకు రాక‌పోయినా ప్ర‌స్తుతం వ్యాక్సినేష‌న్ కు భారీ స్పంద‌న వ‌స్తోంది.