దేవి శ్రీ ప్ర‌సాద్ ఇంట తీవ్ర విషాదం..!

-

టాలీవుడ్ ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేశీ శ్రీ ప్ర‌సాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దేవీ శ్రీ ప్ర‌సాద్ బాబాయి బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆయ‌న‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. అయితే ఇంత‌లోనే దేవీ శ్రీ ఇంట మ‌రో విషాదం చోటు చేసుకుంది. దేవీ శ్రీ బాబాయి బుల్గానిన్ మ‌రణ వార్త విని దేవీ శ్రీ ప్ర‌సాద్ మేన‌త్త సీతా మ‌హాల‌క్షి గుండెపోటుతో మ‌ర‌ణించారు. దాంతో వ‌రుస మ‌ర‌ణ వార్త‌లు విని కుటుంబం తీవ్ర విషాదంలో నిండి పోయింది.

ఇదిలా ఉండ‌గా దేవి శ్రీ ప్ర‌సాద్ ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ చిత్రాల‌కు స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. అల్లు అర్జున్ మ‌రియు సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న పుష్ప సినిమాకు కూడా దేవీ శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. ఈ సినిమా నుండి దాక్కో దాక్కో మేక పాట విడుద‌ల‌వ‌గా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ దేవీ శ్రీ..బ‌న్నీ, సుక్కు కాంబోలో తెర‌కెక్కిన ఆర్య మ‌రియు ఆర్య 2 సినిమాల‌కు స్వ‌రాలు సమ‌కూర్చారు. ఈ రెండు సినిమాల పాట‌లు కూడా ఎంతో ఆక‌ట్టుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news