హ్యాపీ బ‌ర్త్‌డే మోడీజీ .. రాహ‌ల్ గాంధీ ఆస‌క్తిక‌ర ట్విట్‌!

Happy birthday PM Modi: నేడు దేశ ప్ర‌ధాని నరేంద్ర మోడీ 71వ పుట్టిన రోజు. దీంతో ప్ర‌పంచ దేశాల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు ప్రధాని మోడీకి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

modi
modi

ప్రధాని మోడీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని భగవంతున్ని కోరుకుంటున్నట్టు ట్విట్ చేశారు.

అలాగే ‘ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు. మీ అపారమైన కృషి, సమర్థ నాయకత్వం, అంకితభావం దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించడానికి దోహదపడుతుంది. మీరు ఇలానే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నా’అని ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్య నాయుడు ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు.

ప్ర‌తిప‌క్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా శుభాకాంక్ష‌లు తెలిపారు. హ్యాపీ బ‌ర్త్‌డే, మోడీజీ అంటూ రాహుల్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా మోడీకి బ‌ర్త్‌డే విషెస్ చెప్పారు. సుదీర్ఘ కాలం ఆయురారోగ్యాల‌తో జీవించాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

దేశవ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలను నిర్వహించనున్నారు బీజేపీ కార్య‌క‌ర్త‌లు. పుట్టినరోజు సందర్భంగా.. నామో యాప్‌లో ప్రధాని మోదీ పుట్టినరోజుకు సంబంధించిన ఎగ్జిబిషన్ చూపబడుతుంది. న‌మో యాప్‌లో ‘అమృత్ ప్రయాస్ అనే ఆప్షన్ పెట్టారు. దీని ద్వారా ప్రజలు రక్తదాన శిబిరం, పరిశుభ్రత ప్రచారం, వృద్ధాశ్రమంలో సేవ వంటి కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. పుట్టిన రోజు సందర్భంగా దేశానికి సేవ చేయడానికి ప్రతిజ్ఞ చేయాలని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.