అమ్మో కరోనా వస్తే ఇక చచ్చిపోవడమే… చాలా మందిలో ఉన్న భయం ఇదే. కరోనా వైరస్ ని కట్టడి చేయడం సాధ్యం కాదు. ఇవాళ నయం అయినా సరే మళ్ళీ మన శరీరంలో ఉంటుంది కచ్చితంగా చచ్చిపోతాం అనే భయం చాలా మందికి ఉంటుంది. కరోనాకు మందు కనుక్కోకపోవడం తో ఇప్పుడు ఈ భయం మరింత ఎక్కువగా ఉంది జనాలకు. అయితే దీన్ని ప్రస్తుతం రోగ నిరోధక శక్తి పెంచే ఔషధాల ద్వారా కట్టడి చేస్తున్నారు.
ఇక ఏదైనా వ్యాధులు, అంతక ముందు ఏదైనా రోగాలు వచ్చిన వాళ్ళు వెంటనే చనిపోతారు… ఇక మార్గం లేదని చెప్తూ ఉంటారు. కాని కేరళలో ఇద్దరు వృద్దులు మాత్రం కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారు. కేరళలో 93 ఏళ్ళ వృద్దుడు, 88 ఏళ్ళ అతని భార్య ఇద్దరూ కూడా కరోనా నుంచి కోలుకున్నారు. ఇద్దరికీ కూడా కరోనాతో పాటుగా డయాబెటిస్, హైపర్‌టెన్షన్, ఇతర వయోభార సమస్యలు ఉన్నాయి.
అయినా సరే వారు మాత్రం కోలుకున్నారు. కొన్ని దేశాల్లో అయితే ఆరోగ్య సమస్యలు ఉన్న వ్రుద్దులను ఆస్పత్రుల్లో కూడా జాయిన్ చేసుకునే పరిస్థితి లేదు. వారికి 40 మంది వైద్యుల బృందం చికిత్స అందించింది. ముందు వారి ఆరోగ్యం క్షీణించినా సరే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడంతో ఇద్దరూ కూడా కరోనా నుంచి బయటపడ్డారు. అయితే వారికి చికిత్స అందించిన ఒక నర్సుకి మాత్రం కరోనా సోకింది.