అక్కడ శవాలను ఉంచడానికి స్థలం లేదా…?

-

అమెరికాలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో అక్కడి ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఏ విధంగా కరోనా వైరస్ ని కట్టడి చెయ్యాలో అర్ధం కాని పరిస్థితుల్లో అమెరికా ఉంది. మరణాలు కూడా భారీగా పెరగడం అమెరికాను మరింత కలవరానికి గురి చేస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు. ఇది పక్కన పెడితే అక్కడ ఒక కొత్త సమస్య వచ్చి పడింది.

ఆ సమస్య ఏంటీ అనేది ఒకసారి చూస్తే… అమెరికాలో కరోనా కారణంగా అక్కడ ఒక్క రోజే 1,900 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీనితో అక్కడ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,788 కు చేరుకుంది. న్యూయార్క్‌లో కరోనాతో 6,268 మంది కరోనా దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. 151,171 మందికి ఆ రాష్ట్రంలో కరోనా బయటపడింది. ఆ రాష్ట్రంలోనే దాదాపు 1500 మంది ప్రాణాలు కోల్పోయారు.

అయితే ఇప్పుడు అమెరికాలో శవాలను ఉంచడానికి స్థలం దొరకడం లేదు. ఏ విధంగా వాళ్ళను దహనం చెయ్యాలో అర్ధం కావడం లేదు అమెరికాకు. ఇక వాళ్ళను దహనం చేయడానికి ఎవరూ ముందుకి రావడం లేదు. స్మశాన వాటికలు కూడా అక్కడ ఖాళీగా లేవు. ఇక రోగం సోకిన వాళ్లకు కూడా అక్కడ ఆస్పత్రులు దొరకడం లేదు. దీనిపై కూడా సర్వాత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో శవాలను ఉంచుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news