కరోనా వైరస్ కి వైరస్ తోనే చికిత్స… వ్యాక్సిన్ వస్తుందా…?

-

కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి ప్రపంచం మొత్తం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడి విషయంలో ఇప్పటి వరకు సామాజిక దూరం తో పాటుగా… రోగ నిరోధక శక్తి ఔషధాలను వాడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ మందుని కనుక్కొనే విషయంలో కీలక అడుగు పడింది. ఇప్పటివరకు కరోనా వైరస్‌ కుటుంబం అయిన సార్స్ మెర్స్, కోవిడ్ 19 కి ఏ మందు కనుక్కోలేదు.

దీని కోసం ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ మైక్రోబయాలజీకి చెందిన ఎంబయో అనే జర్నల్‌లో ఒక వ్యాసం వచ్చింది. ఈ వ్యాసంలో ఆశలు చిగురించాయి. మెర్స్‌పై పరిశోధన చేస్తున్న పరిశోధకుల బృందం ఒక టీకాపై ఆశగా ఎదురు చూస్తుంది. మెర్స్‌ సోకకుండా అడ్డుకునే టీకానే దీని నివారణకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

కుక్కల్లో ‘కెన్నెల్‌ కాఫ్‌’కు కారణమయ్యే పారా ఇన్‌ఫ్లూయంజా వైరస్‌5 (పీఐవీ5)ను ద్వారా ఈ టీకా మోడల్ ని అభివృద్ధి చేసారు. ఇది మనుషులపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉండదని, ఈ వైరస్‌లో జన్యుపరమైన మార్పులు చేసి ‘ఎస్‌’ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసేలా రూపొందించారు. దీనిని ఎలుకలకు ఇచ్చారు పరిశోధకులు. మరో బ్యాచ్‌ ఎలుకలకు జన్యుపరంగా ఎటువంటి మార్పులు చేయని పీఐవీ5 వైరస్‌ ఉన్న టీకాను ఇవ్వగా…

4వారాల తర్వాత వాటిని మెర్స్‌కు కారణమయ్యే వైరస్‌ ప్రభావానికి గురయ్యేలా చేసి… జన్యుపరమైన మార్పులు చేసిన పీఐవీ5 టీకా వేసిన ఎలుకలు ఇన్ఫెక్షన్‌ను తట్టుకుని నిలబడ్డాయి. ఎటువంటి మార్పులు లేకుండా పీఐవీ5 టీకా వేసిన ఎలుకలు చనిపోయాయి. వీటితో పాటుగా క్రియారహితంగా ఉన్న మెర్స్‌ వైరస్‌ ఉన్న టీకాను తీసుకొన్న ఎలుకలు 25% ఇన్ఫెక్షన్‌ను తట్టుకుని నిలబడ్డాయి. జన్యుపరంగా పీఐవీ5 ఆధారిత టీకా నమ్మకమైనదిగా ఉందని పరిశోధకులు విశ్వాసం వ్యక్తం చేసారు. ఇది కోవిడ్ కి పని చేస్తుంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news