గుడ్ న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

-

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఇన్ని రోజులు 40 వేలకు పైగా నమోదు కేసులు తాజాగా తగ్గుముఖం పట్టాయి. 111 రోజుల తర్వాత అతి తక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. పూర్తిగా కరోనా కేసులు తగ్గిపోవాలని, సాధారణ పరిస్థితులు రావాలని కోరుకుంటున్నారు.

తాజాగా దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 34 వేల 703 కొత్తగా కేసులు నమోదయ్యాయి. 51 వేల 864 మంది చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. జాతీయ రికవరీ రేటు 97.17శాతానికి పెరిగిందని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఈ వారం పాజిటివిటీ రేటు 2.40శాతంగా ఉందని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.11శాతానికి పడిపోయిందని తెలిపింది. ఇప్పవరకూ 42 కోట్ల 14 లక్షల మందికి కరోనా పరీక్షలు చేసినట్లు స్పష్టం చేసింది. మొత్తం 35 కోట్ల 75 కోట్ల మందికి వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news