తెలంగాణ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ విలయ తాండవం చేస్తుంది. ప్రతి రోజూ 2500 లకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి చాలా ప్రముఖులకు, సినీ తారలకు, రాజకీయ నాయకుకు సోకింది. తాజాగా తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ లీడర్ జగదీశ్వర్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
దీంతో ఆయన హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి… తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇటీవల కాలంలో… తనను కలిసిన పార్టీ నేతలు, సన్నిహితులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి జగదీశ్వర్ రెడ్డి కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కులు, భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే… రేవంత్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి లాంటి ప్రముఖ రాజకీయ నాయకులకు కరోనా సోకింది.